ఫేస్‌బుక్ గుత్తాధిపత్యం... జుకర్‌బర్గ్ పక్కావ్యూహం...

ABN , First Publish Date - 2020-08-13T01:58:58+05:30 IST

సోషల్ మీడియా అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన ఫేస్‌బుక్. ప్రపంచంలో ఎక్కువగా వినియోగించే సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్. అయినప్పటికీ జుకర్ బర్గ్ కొత్త కొత్త ప్లాట్‌ఫామ్స్‌ను ప్రారంభించడం ద్వారా లేదా కొనుగోళ్లు చేయడం ద్వారా తన వ్యాపారాన్ని రోజురోజుకు విస్తరించుకుంటోన్న విషయం తెలిసిందే.

ఫేస్‌బుక్ గుత్తాధిపత్యం... జుకర్‌బర్గ్ పక్కావ్యూహం...

శాన్‌ఫ్రాన్సిస్‌కో : సోషల్ మీడియా అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన ఫేస్‌బుక్. ప్రపంచంలో ఎక్కువగా వినియోగించే సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్. అయినప్పటికీ జుకర్ బర్గ్ కొత్త కొత్త ప్లాట్‌ఫామ్స్‌ను ప్రారంభించడం ద్వారా లేదా కొనుగోళ్లు చేయడం ద్వారా తన వ్యాపారాన్ని రోజురోజుకు విస్తరించుకుంటోన్న విషయం తెలిసిందే.


సోషల్ మీడియాలో మరికొన్ని నెట్‌వర్క్‌ల నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నప్పటికీ... జుకర్‌బర్గ్ ఆధ్వర్యంలోని ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్‌లను ఏ నెట్‌వర్క్ కూడా అందుకోలేకపోతోంది. ఒకవిధంగా జుకర్‌బర్గ్‌దే గుత్తాధిపత్యం. జుకర్‌బర్గ్ నియంత్రణలో ఉన్న సోషల్ నెట్ వర్కింగ్ ప్లాట్‌ఫామ్స్ 6.98 బిలియన్‌లకు పైగా యూజర్లను కలిగి ఉంది.


అంటే దాదాపు 7 బిలియన్ డాలర్లు. ప్రపంచ జనాభా 7.6 బిలియన్లు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే... సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఒక వ్యక్తి ఒకటికి మించి అకౌంట్స్‌ను కలిగి ఉంటారన్న విషయం తెలిసిందే. ఇందులో ఫేస్‌బుక్ 2.6 బిలియన్ యూజర్లను కలిగి ఉంది. ప్రపంచ జనాభాలో ఇది 34.66 శాతం.


మొత్తంమీద సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఫేస్‌బుక్ అగ్రస్థానంలో ఉంది. రెండు బిలియన్ యాక్టివ్ యూజర్లతో వాట్సాప్ మూడో స్థానంలో ఉంది. జుకర్ బర్గ్ ఆధ్వర్యంలోని సోషల్ మీడియాలలో రెండో స్థానం సంపాదించింది. ఫేస్‌బుక్ మెసెంజర్. ఇక... 1.3 బిలియన్ యూజర్లతో ఇన్‌స్టాగ్రామ్... నాలుగో స్థానంలో ఉంది. 


మోస్ట్ పాపులర్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు ఇవే... ప్రపంచవ్యాప్తంగా టాప్ 15 సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఫేస్‌బుక్ మొదటి స్థానంలో ఉంది. అక్షరాలా 2,603 మిలియన్(2.6 బిలియన్) యూజర్లున్నారు. ఆ తర్వాత వాట్సాప్‌కు రెండు వేల మిలియన్లు, యూట్యూబ్‌కు రెండు వేల మిలియన్లు, ఫేస్‌బుక్ మెసెంజర్‌కు 1,300 మిలియన్లు, విచాట్‌కు 1,203 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌కు 1,082 మిలియన్లు, టిక్‌టాక్‌కు 800 మిలియన్లు, క్యూక్యూకు 694 మిలియన్లు, సినా వీబోకు 550 మిలియన్లు, క్యూజోన్‌కు 517 మిలియన్లు, రెడ్డిట్‌కు 430 మిలియన్లు, కౌషౌకు 400 మిలియన్లు, స్నాప్‌చాట్‌కు 397 మిలియన్లు, పిన్‌టెరెస్ట్‌కు 367 మిలియన్లు, ట్విట్టర్‌కు 326 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు.


కాగా... ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో కొన్ని ఏడాదిగా అప్ డేట్ చేయనివి ఉన్నాయి. అలాగే కొన్నింటి డేటా థర్డ్ పార్టీ నుండి సేకరించింది. టాప్ 15 సైట్లలో జుకర్‌బర్గ్ సంస్థలదే సగం వాటా కావడం విశేషం. టాప్ 15 సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో జుకర్‌బర్గ్‌కు చెందిన ఫేస్‌బుక్, మెసెంజర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ యాక్టివ్ యూజర్లు 6.98 బిలియన్లతో 47.8 శాతం వాటాను దక్కించుకుంది. అంటే దాదాపు సగం జుకర్ బర్గ్ నాలుగు సైట్లదే హవా. అందులో ఫేస్‌బుక్ వాటానే మూడొంతులు. టాప్ 15 లోని మిగతా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల యాక్టివ్ యూజర్లు 7.68 బిలియన్లు. మిగతా సైట్స్ అన్నీ కలిపి కేవలం అర బిలియన్ కంటే కొంచెం ఎక్కువ మాత్రమే ఉన్నాయి. మొత్తంగా టాప్ 15 సైట్స్‌లకు కలిపి 14.6 బిలియన్‌ల యాక్టివ్ యూజర్లున్నారు. 


కొనుగోలు... కాపీ... దేనికైనా రెడీ... సోషల్ మీడియాలో పక్కా వ్యాపార ధోరణితోనే జుకర్‌బర్గ్ ముందుకు సాగుతున్నాడు. కొత్తవి ప్రారంభించడం లేదా కొనుగోలు చేయడం లేదా పోటీ సోషల్ సైట్ల ఫ్యూచర్స్‌ను అనుకరించడం వంటి మార్గాల్లో పయనించడంలో పెద్దఎత్తున యూజర్ బేస్ ఉంటుంది. ఉదాహరణకు ఫేస్‌బుక్ తన పోటీ సైట్ స్నాప్‌చాట్ ఫీచర్స్‌ లో కొన్నింటిని కాపీ చేసిందని చెబుతుంటారు. ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్, వాట్సాప్‌లకు మరెన్నో అంశాలను జోడించింది.


ఫేస్‌బుక్ గుత్తాధిపత్యం... జుకర్‌ర్గ్‌కు చెందిన సోషల్ మీడియా సైట్స్ ఆధిపత్యం నేపధ్యంలో... పరిశ్రమలో పోటీ ప్రశ్న నెలకొంది. భవిష్యత్తులో ఫేస్‌బుక్ ఇతర నెట్ వర్క్‌లను కొనుగోలు చేయకుండా నిరోధించాల్సిన అవసరం ఉందనే వాదనలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. కాంపిటీటర్స్‌ను కొనుగోలు చేస్తున్నందున ఫేస్‌బుక్‌కు తిరుగు లేకుండా పోయిందని, పోటీదారులు లేకుండా పోయారని పరిశ్రమలోని పలువురు వాదిస్తున్నారు.



Updated Date - 2020-08-13T01:58:58+05:30 IST