విదేశీ విద్యానిధి దరఖాస్తు గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2021-06-16T14:27:39+05:30 IST

విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే ఎస్టీ పేద విద్యార్థులు అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకునే గడువును ఎస్టీ సంక్షేమ శాఖ పొడిగించింది.

విదేశీ విద్యానిధి దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్‌: విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే ఎస్టీ పేద విద్యార్థులు అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకునే గడువును ఎస్టీ సంక్షేమ శాఖ పొడిగించింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకునే పీజీ విద్యార్థులకు ఈ పథకం కింద రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని ఎస్టీ సంక్షేమ శాఖ అందిస్తోంది. వీసా ఫీజుతోపాటు విమాన చార్జీలూ ఇస్తోంది. జూలై 1 నాటికి 35 ఏళ్ల దాటని ఎస్టీ విద్యార్థులు, కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. పూర్తి వివరాలకు www.telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఎస్టీ సంక్షేమ శాఖ సూచించింది. 


Updated Date - 2021-06-16T14:27:39+05:30 IST