ఆదిలాబాద్ రిమ్స్‌లో ఎక్స్‌ఫైర్ అయిన మందుల వాడకంపై డైరెక్టర్ వింత సమాధానం

ABN , First Publish Date - 2021-06-15T19:59:43+05:30 IST

ఆదిలాబాద్: నగరంలోని రిమ్స్‌ ఆస్పత్రిలో ఎక్స్‌ఫైర్ అయిన మందుల వాడకంపై...

ఆదిలాబాద్ రిమ్స్‌లో ఎక్స్‌ఫైర్ అయిన మందుల వాడకంపై డైరెక్టర్ వింత సమాధానం

ఆదిలాబాద్: నగరంలోని రిమ్స్‌ ఆస్పత్రిలో ఎక్స్‌ఫైర్ అయిన మందుల వాడకంపై డైరెక్టర్ బలరామ్ నాయక్ వింత సమాధానం చెబుతున్నారు. ఎక్స్‌ఫైర్ సమయం దాటాక మూడు నెలల వరకు మందులు వాడవచ్చునని చెబుతున్నారు. అలా అయితే ఎందుకు ఎక్స్‌ఫైర్ డేట్ వేస్తుంటారని రోగుల బంధువులు నిలదీస్తే ఏమీ కాదులే.. ఏ మందులు ఎలా వాడాలో మాకు తెలవదా అని అంటున్నారు. డైరెక్టర్ వాదన అందరికీ షాక్‌కు గురిచేస్తోంది. జనవరిలో ఎక్స్‌ఫైర్ అయిన యాంటి బయోటిక్ ఇంజక్షన్లు వాడడం వల్ల రోగుల ప్రాణాలకు హానీ జరిగితే ఎవరు బాధ్యులని స్థానిక బీజేపీ నేతలు రిమ్స్ డైరెక్టర్‌ను ప్రశ్నించారు. 

Updated Date - 2021-06-15T19:59:43+05:30 IST