కరీంనగర్: అందరినీ టీఆర్ఎస్ నేతలు కోవర్ట్ చేసుకున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఓటుకు రూ.6 వేలు అంటే ప్రపంచమంతా సిగ్గుపడిందన్నారు. ప్రజలే నాయకులై తనను నడిపించారని చెప్పారు. దళితబంధు రాకున్నా పర్లేదని తనను ఆదరించారని వారిని కొనియాడారు. కేసీఆర్ నిరంకుశత్వాన్ని పాతరపెట్టేందుకు అందరూ కృషి చేశారని చెప్పారు. ఫలితం తర్వాత తెలంగాణలో పెను మార్పులు వస్తాయన్నారు.