Hyderabad : కేసీఆర్ ప్రభుత్వాన్ని(KCR Government) ప్రజలు గద్దెదించడం ఖాయమని ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender) పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత కాంగ్రెస్(Congress), టీఆర్ఎస్(TRS)లు ఫ్రెండ్లీ పార్టీలుగా మారతాయన్నారు. ప్రజాధనాన్ని సీఎం కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ప్రజాధనాన్ని వృథా చేస్తూ టీఆర్ఎస్ హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తోందన్నారు. బీజేపీ(BJP) పండగకు.. కేసీఆర్ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ(Telangana)లో చెల్లని కేసీఆర్ మొహం.. పక్క రాష్ట్రాల్లో చెల్లుతుందా? అని ఈటల ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని కేసీఆర్ దేశాన్ని ఏలుతారా? అని నిలదీశారు. కేసీఆర్ దోపిడీ వల్లే రాష్ట్ర ఖజానా దివాళా తీసిందని ఈటల విమర్శించారు.