రైతులకు బేడీలు వేసిన ఎస్కార్ట్ పోలీసులపై సస్పెన్షన్ ఎత్తివేత

ABN , First Publish Date - 2020-10-31T23:26:44+05:30 IST

రాజధాని రైతులకు బేడీలు వేసిన ఎస్కార్ట్ పోలీసులపై అధికారులు సస్పెన్షన్ ఎత్తివేశారు. రైతులకు బేడీలు ఘటన తర్వాత ఆరుగురు పోలీసులను ఎస్పీ సస్పెండ్ చేశారు. అయితే వారు రైతులని తమకు తెలిదని ఉన్నతాధికారులను ఎస్కార్ట్ సిబ్బంది

రైతులకు బేడీలు వేసిన ఎస్కార్ట్ పోలీసులపై సస్పెన్షన్ ఎత్తివేత

గుంటూరు: రాజధాని రైతులకు బేడీలు వేసిన ఎస్కార్ట్ పోలీసులపై అధికారులు సస్పెన్షన్ ఎత్తివేశారు. రైతులకు బేడీలు ఘటన తర్వాత ఆరుగురు పోలీసులను ఎస్పీ సస్పెండ్ చేశారు. అయితే వారు రైతులని తమకు తెలిదని ఉన్నతాధికారులను ఎస్కార్ట్ సిబ్బంది వేడుకున్నారు. దీంతో వారిపై జిల్లా ఎస్పీ సస్పెన్షన్ ఎత్తివేశారు. మరోవైపు శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది.


మూడు రాజధానులకు మద్దతుగా నిరసన చేపట్టిన వారిని రైతులు అడ్డుకున్నారు. రైతులను అరెస్ట్ చేసి పోలీసులు సంకెళ్లు వేసి తీసుకెళ్లారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. అప్రమత్తమైన పోలీస్ శాఖ సంకెళ్లు వేసిన పోలీసులను సస్పెండ్ చేసింది. తాజాగా తెలియక పోరపాటు జరిగిందన్న కారణంతో వారిపై సస్పెన్షన్ ఎత్తివేశారు.

Updated Date - 2020-10-31T23:26:44+05:30 IST