వరవరరావు విడుదలకు మంత్రి ఎర్రబెల్లి చొరవ

ABN , First Publish Date - 2020-06-04T02:21:05+05:30 IST

విప్లవ కవి వరవరరావు విడుదలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చొరవ తీసుకున్నారు. వరవరరావు విడుదల విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి ఎర్రబెల్లి తీసుకెళ్లారు.

వరవరరావు విడుదలకు మంత్రి ఎర్రబెల్లి చొరవ

వరంగల్: విప్లవ కవి వరవరరావు విడుదలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చొరవ తీసుకున్నారు. వరవరరావు విడుదల విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి ఎర్రబెల్లి తీసుకెళ్లారు. వరవరరావు వయోభారం, అనారోగ్యాన్ని కేసీఆర్‌కి వివరించారు. ఎర్రబెల్లి సూచనకు సీఎం సానుకూలంగా స్పందించారు. మహారాష్ట్ర పోలీసులతో మాట్లాడాలని డీజీపీ మహేందర్‌రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు.అనంతరం  డీజీపీ మహేందర్‌రెడ్డిని కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు కలిశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర పోలీసులతో డీజీపీ మాట్లాడారు. 


వరవరరావు తీవ్ర అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. ఆకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అప్రమత్తమైన జైలు సిబ్బంది హుటాహుటిన నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. నవీముంబైలోని తలోజా సెంట్రల్‌ జైల్లో ఏడాదిన్నరగా విచారణ ఖైదీగా ఉన్నారు. ఇటీవల ఆయన కళ్లు తిరిగిపడిపోయారు. ఆస్పత్రిలో ఆయన ఛాతీకి ఎక్స్‌రే తీశారు. కరోనా పరీక్షలతో పాటు మరికొన్ని పరీక్షలు చేశారు. పైల్స్‌, రక్తపోటు, సైనోసైటిస్‌, మైగ్రేన్‌, కాలివాపు, వెర్టిగో వంటి వ్యాధులతో  బాధపడుతున్న వరవరరావుకు బెయిల్‌ మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2020-06-04T02:21:05+05:30 IST