వరంగల్ అర్బన్ కలెక్టరేట్‌ను పరిశీలించిన ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-06-15T19:32:51+05:30 IST

వరంగల్ : వరంగల్ అర్బన్ కలెక్టరేట్ కార్యాలయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

వరంగల్ అర్బన్ కలెక్టరేట్‌ను పరిశీలించిన ఎర్రబెల్లి

వరంగల్ : వరంగల్ అర్బన్ కలెక్టరేట్ కార్యాలయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఈ నెల 21న వరంగల్‌లో పర్యటించి ఎంజీఎం సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కు శంకుస్థాపన చేసి వరంగల్ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు ఒకే దగ్గర అందుబాటులో ఉండేలా ఈ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. లక్షా 50వేల అడుగుల విస్తీర్ణంలో సమీకృత కలెక్టరేట్‌ను నిర్మించామన్నారు. అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణాలు పూర్తి కానున్నాయన్నారు. చరిత్రలో నిచిపోయే విధంగా సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలుకుతామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.


Updated Date - 2021-06-15T19:32:51+05:30 IST