ఆరోగ్య ప్రపంచం కోసం...

ABN , First Publish Date - 2020-03-27T05:10:46+05:30 IST

విశ్వం మీద మహమ్మారుల్లాంటి రోగాలు విరుచుకుపడడం కొత్తేమీ కాదు. ప్రతి శతాబ్దం ఏదో ఒక రకమైన భయానక వ్యాధిని ఎదుర్కొంటూనే ఉంది. కానీ...

ఆరోగ్య ప్రపంచం కోసం...

విశ్వం మీద మహమ్మారుల్లాంటి రోగాలు విరుచుకుపడడం కొత్తేమీ కాదు. ప్రతి శతాబ్దం ఏదో ఒక రకమైన భయానక వ్యాధిని ఎదుర్కొంటూనే ఉంది. కానీ వాటిని తట్టుకొని మానవాళి మనుగడను నిలబెట్టుకుంటూ వస్తోంది. కారణం బతకాలన్న సంకల్పం!


ఏసు ప్రభువు తన జీవిత కాలంలో ఎన్నో ప్రాంతాల్లో తిరిగాడు. తనకు ఎదురైన ప్రతి రోగికీ స్వస్థత చేకూర్చాడు. ఎన్నో అనారోగ్యాలను నయం చేశాడు. దీనికి కృతజ్ఞత చెల్లించుకోవాలంటే దైవం పట్ల విశ్వాసం కలిగి ఉండాలనీ, పొరుగువారిని  ప్రేమించాలనీ ఆయన ఆదేశించాడు. కాబట్టి మనకోసం, మన తోటి వారికోసం కోసం దైవాన్ని ప్రార్థించాలి. వ్యాధిగ్రస్థులందరికీ స్వస్థత చేకూర్చాలనీ, వారిలో శక్తినీ, ఆరోగ్యాన్నీ నింపాలనీ విన్నవించుకోవాలి. నాకేం కాదనే గర్వాన్ని మనుషుల నుంచి తొలగించాలనీ, అలాగే భయం కోరల్లో ఎవరూ చిక్కుకోకుండా కాపాడాలనీ వేడుకోవాలి. లోకం శాంతితో, ప్రేమతో నిండాలని కోరుకోవాలి. దైవాన్ని విశ్వాసి చేరుకోవడం ప్రార్థన ద్వారానే సాధ్యం! ఆరోగ్యవంతమైన ప్రపంచం కోసం ప్రార్థన చేయడం అందరూ పాటించాల్సిన పవిత్రమైన కర్తవ్యం. 

Updated Date - 2020-03-27T05:10:46+05:30 IST