Abn logo
Aug 14 2020 @ 03:33AM

క్రికెట్‌కు లారా మార్ష్‌ గుడ్‌బై

లండన్‌: ఇంగ్లండ్‌ మహిళల జట్టు ఆఫ్‌ స్పిన్నర్‌ లారా మార్ష్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. 2009, 2017 వన్డే ప్రపంచ కప్‌ టైటిళ్లు నెగ్గిన ఇంగ్లండ్‌ జట్టులో ఆమె సభ్యురాలు. 2009 టీ20 వరల్డ్‌కప్‌ సాధించడంలోనూ లారా కీలక పాత్ర పోషించింది. 33 ఏళ్ల మార్ష్‌ ఈ మేరకు తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ట్విటర్‌లో గురువారం పోస్ట్‌ చేసింది. 9 టెస్టుల్లో 24 వికెట్లు తీసిన ఆమె.. 103 వన్డేల్లో 129, 67 టీ20ల్లో 64 వికెట్లు పడగొట్టింది. ‘రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయమని భావిస్తున్నా. 13 ఏళ్ల కెరీర్‌లో నాకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు’ అని మార్ష్‌ తెలిపింది. 

Advertisement
Advertisement
Advertisement