Abn logo
Oct 23 2021 @ 20:41PM

ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి విండీస్ విలవిల

దుబాయ్: ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌‌: డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్‌పై ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో వెస్టిండీస్ బ్యాటింగ్‌కు దిగింది. సూపర్ 12 గ్రూప్ 1లో ఇంగ్లాండ్, విండీస్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఆదిలోనే విండీస్ కష్టాల్లో పడింది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి విండీస్ బ్యాట్స్ మెన్స్ వరుసగా ఔటయ్యారు. 12.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విండీస్ 49 పరుగులు చేసింది.