England vs India : ఇంగ్లాండ్ విజ‌ృంభణ.. భారత్ ముందు భారీ లక్ష్యం..

ABN , First Publish Date - 2022-07-11T02:23:44+05:30 IST

ఇండియా - ఇంగ్లండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు చెలరేగింది. భారత్‌కు 216 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

England vs India : ఇంగ్లాండ్ విజ‌ృంభణ.. భారత్ ముందు భారీ లక్ష్యం..

బర్మింగ్‌హామ్ : ఇండియా - ఇంగ్లండ్ (England vs India)మధ్య మూడో టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు చెలరేగింది. భారత్‌కు 216 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 5 సిక్సర్లు, 6 ఫోర్లతో డేవిడ్ మలన్ (Dawid Malan)విజృంభణ, చివరిలో లియామ్ లివింగ్‌స్టోన్ (Liam Livingstone) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 పరుగులు నమోదు చేసింది. భారత బౌలర్లు ఉమ్రాన్ మాలిక్, ఆవేశ్ ఖాన్‌, హర్షల్ పటేల్‌లతోపాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. వికెట్లు తీయడంలో విఫలమవ్వడమే కాకుండా ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. రవీంద్ర జడేజా 4 ఓవర్లు వేసి 45 పరుగులు ఇవ్వగా.. నయా పేసర్ ఉమ్రాన్ మాలిక్ 4 ఓవర్లు వేసి ఏకంగా 56 పరుగులు సమర్పించాడు. 2 వికెట్లతో రవి బిష్ణోయ్ ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించాడు.


ఇంగ్లండ్ స్కోర్ బోర్డ్..

జాసన్ రాయ్(27), జాస్ బట్లర్(18), డేవిడ్ మలన్(77), ఫిలిప్ సాల్ట్(8), లియామ్ లివింగ్‌స్టోన్(42 నాటౌట్), మొయిన్ అలీ(0), హ్యారీ బ్రూక్(19), క్రిస్ జోర్డాన్(11, రనౌట్) చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్ చెరో 2 వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్ చెరో వికెట్ తీశారు. 

Updated Date - 2022-07-11T02:23:44+05:30 IST