బెట్టింగ్ వ్యసనానికి ఇంజనీరింగ్ విద్యార్థి బలి

ABN , First Publish Date - 2021-02-28T01:05:50+05:30 IST

బెట్టింగులకు పాల్పడి తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకున్నా

బెట్టింగ్ వ్యసనానికి ఇంజనీరింగ్ విద్యార్థి బలి

చిత్తూరు: బెట్టింగులకు పాల్పడి తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకున్నాడు ఓ ఇంజనీరింగ్ విద్యార్థి. ఈ దారుణ సంఘటన జిల్లాలోని కుప్పంలో జరిగింది. పట్టణానికి చెందిన కిరణ్‌ ఇంజనీరింగ్ చదవుతున్నాడు. సోషల్ మీడియలో వస్తున్న బెట్టింగ్ ప్రకటనలకు ఆకర్షితుడయ్యాడు. బెట్టింగ్‌ల వ్యసనానికి బానిసగా మారాడు. దీంతో వివిధ బెట్టింగ్‌ల్లో డబ్బులు పెట్టాడు. తెలిసిన వారి దగ్గరా అప్పులు చేశాడు. అయితే అనుకున్నంత సంపాదన రాలేదు. దీంతో అప్పులపాలై ఆ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని శాంతిపురం మండలం రాళ్లబుదుగురుకు చెందిన మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బసవరాజు కుమారుడిగా గుర్తించారు. బెట్టింగ్‌లతో జీవితాలు నాశనం చేసుకోవద్దని ఇన్‌స్టాగ్రాంలో చనిపోయే ముందు కిరణ్ పోస్ట్‌ చేశాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-02-28T01:05:50+05:30 IST