ఎండోమెట్రియోసిస్‌ అంటే?

ABN , First Publish Date - 2022-03-08T05:30:00+05:30 IST

మహిళలను వేధించే సమస్యల్లో ఎండోమెట్రియోసిస్‌ ప్రధానమైనది. నొప్పితో కూడిన ఈ సమస్యకు కారణాలు, లక్షణాలు, చికిత్సల గురించి తెలుసుకుందాం!

ఎండోమెట్రియోసిస్‌ అంటే?

మహిళలను వేధించే సమస్యల్లో ఎండోమెట్రియోసిస్‌ ప్రధానమైనది. నొప్పితో కూడిన ఈ సమస్యకు కారణాలు, లక్షణాలు, చికిత్సల గురించి తెలుసుకుందాం! 


ఎండోమెట్రియోసిస్‌ అంటే?

గర్భాశయం లోపల పెరగవలసిన ఎండోమెట్రియం అనే పొర గర్భాశయం బయట పెరిగే పరిస్థితే ఎండోమెట్రియోసిస్‌. దీని ప్రభావం అండాశయాలు, కటి ప్రదేశంలోని కణజాల పైపొరలు, ఫెలోపియన్‌ ట్యూబుల మీద ఉంటుంది. ఎండోమెట్రియోసి్‌సలో ఎండోమెట్రియం కణజాలం మందంగా మారి, గర్భాశయం నుంచి విడిపోయి, నెలసరి రక్తస్రావంతో పాటు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. 


కారణాలు ఇవే... 

నెలసరి రక్తస్రావ సమస్యలు మొదలవుతాయి. రక్తస్రావం తిరోగమనంలో జరగడం వల్ల ఈ సమస్య మొదలవుతుంది. 

గర్భాశయ లోపలి పొర ఎండోమెట్రియం జన్యుపరంగా తల్లి నుంచి బిడ్డకు వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది. కాబట్టి ఎండోమెట్రియోసిస్‌ జన్యుపరమైన కారణాలూ ఉంటాయి.

రోగనిరోధకశక్తి సమస్యలుఫ హార్మోన్ల అవకతవకలు ఫ కొన్ని రకాల సర్జరీలు 


లక్షణాలు ఇలా...

కటి ప్రదేశంలో నొప్పి

నొప్పితో కూడిన నెలసరి

వెన్ను నొప్పి

పొత్తికడుపు నొప్పి

తీవ్ర నెలసరి రక్తస్రావం లేదా నెల మధ్యలో రక్తస్రావం

బలహీనత


గర్భధారణ సమస్యలు 

వ్యాధి నిర్థారణ: అలా్ట్రసౌండ్‌ పరీక్షతో పునరుత్పత్తి అవయవాల్లోని సమస్యలను తేలికగా కనిపెట్టవచ్చు. మరీ ముఖ్యంగా ఎండోమెట్రియోసి్‌సతో సంబంధం ఉన్న సిస్ట్‌లు ఈ పరీక్షలో కనిపిస్తాయి. ఎమ్మారై పరీక్షతో సిస్ట్‌ల పరిమాణం, ప్రదేశాలు తెలుస్తాయి. కొన్ని సందర్భాల్లో మరింత లోతైన పరీక్ష అవసరం కావొచ్చు. ఇలాంటప్పుడు ల్యాప్రోస్కోపీ ద్వారా గర్భాశయంపైన ఏర్పడుతున్న ఎండోమెట్రియం పొరను పరీక్షిస్తారు. ఎండోమెట్రియంలో తేడాలు, సమస్యలు ఇందులో తెలుస్తాయి. 


చికిత్సలున్నాయి...

నొప్పి తగ్గేలా: నొప్పి తగ్గించే మందులను వైద్యులు సూచిస్తారు. పిల్లలు కనే ఆలోచన లేని మహిళలకు ఈ మందులతో పాటు హార్మోన్‌ థెరపీని కూడా సూచిస్తారు.

హార్మోన్‌ థెరపీ: నెలసరి సమయంలో పెరుగుతూ, తరుగుతూ ఉండే హార్మోన్ల ఫలితంగా కూడా గర్భాశయ లోపలి పొర మందంగా మారుతుంది. ఇలా జరగకుండా, ఎండోమెట్రియల్‌ కణజాలంలో మార్పులు చోటు చేసుకోకుండా ఉండడానికి హార్మోన్‌ థెరపీ సూచిస్తారు.

సర్జరీ: ఎండోమెట్రియోసిస్‌ కలిగి ఉండీ, గర్భధారణకు ప్రయత్నిస్తున్న మహిళలకు వైద్యులు సర్జరీ సూచిస్తారు. ఈ సర్జరీలో భాగంగా గర్భాశయం, అండాశయాలకు హాని కలగకుండా, ఎండోమెట్రియోసిస్‌ సిస్టులు, కణజాలాలను తొలగిస్తారు.  

Updated Date - 2022-03-08T05:30:00+05:30 IST