బ్లాక్‌ టీ షర్టులతో నిరసన

ABN , First Publish Date - 2020-07-06T08:47:04+05:30 IST

వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఫార్ములావన్‌ డ్రైవర్లు ఆదివారం రేసుకు ముందు నల్లటి టీషర్టులతో మోకాలిపై వంగి నిరసన తెలిపారు. వీటిపై ‘ఎండ్‌ రేసిజం’ అనే స్లోగన్‌

బ్లాక్‌ టీ షర్టులతో నిరసన

వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఫార్ములావన్‌ డ్రైవర్లు ఆదివారం రేసుకు ముందు నల్లటి టీషర్టులతో మోకాలిపై వంగి నిరసన తెలిపారు. వీటిపై ‘ఎండ్‌ రేసిజం’ అనే స్లోగన్‌ కనిపించింది. అయితే ఎఫ్‌1లో ఏకైక నల్లజాతీయ డ్రైవర్‌ అయిన హామిల్టన్‌ టీ షర్టుపై ముందు భాగంలో ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ అని, వెనుక భాగంలో ‘ఎండ్‌ రేసిజం’ అని ఉండడం విశేషం. మొత్తం 20 మంది డ్రైవర్లలో ఆరుగురు మాత్రం మోకాలిపై కాకుండా నిలబడే తమ నిరసన తెలిపారు. రైకొనెన్‌, వెర్‌స్టాపెన్‌, చార్లెస్‌ లెక్లెర్క్‌, డానిల్‌ క్వ్యాట్‌, గియోవినాజ్జి, కార్లోస్‌ సెయింజ్‌ జూనియర్‌ వీరిలో ఉన్నారు. మోకాలిపై కూర్చోనంత మాత్రాన తామంతా రేసిజానికి అనుకూలమని భావించరాదని వీరంతా ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2020-07-06T08:47:04+05:30 IST