ఫీల్డ్ అసిస్టెంట్లకే ఉపాధిహామీ బాధ్యతలు

ABN , First Publish Date - 2020-08-04T06:40:02+05:30 IST

గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద నిర్వహించే వివిధ రకాల పనులకు సంబంధించిన బాధ్యతలను గ్రామాల్లో ఉండే ఫీల్డ్ అసిస్టెంట్ (ఎఫ్.ఏ) లకే తిరిగి బాధ్యతలు అప్పగించాలి...

ఫీల్డ్ అసిస్టెంట్లకే ఉపాధిహామీ బాధ్యతలు

గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద నిర్వహించే వివిధ రకాల పనులకు సంబంధించిన బాధ్యతలను గ్రామాల్లో ఉండే ఫీల్డ్ అసిస్టెంట్ (ఎఫ్.ఏ) లకే తిరిగి బాధ్యతలు అప్పగించాలి. కొన్ని నెలల కిందట వీరిని ఉపాధి హామీ నుండి తొలగించి, పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు గత 15ఏళ్ళ నుండి పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీరిని వివిధ కారణాలను సాకుగా చూపి పక్కన పెట్టడం సమంజసం కాదు. పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించి ఎఫ్.ఏ లను విధుల నుండి తొలగించటంతో వారు ఉపాధి కోల్పోయారు. కుటుంబ పోషణ భారమైంది. కొందరు ఎఫ్.ఏలు ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7500మంది ఎఫ్.ఏలు ఉన్నారు. ఉపాధి హామీ ప్రారంభం అయినప్పటి నుండి వీరు తక్కువ వేతనంతోనే పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీరి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాల్సింది పోయి, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు పూర్తిస్థాయిలో ఉపాధి బాధ్యతలను అప్పగించడం సరైంది కాదు.

శ్రీనివాస్ చిరిపోతుల

వెంకటేశ్వర్లపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా

Updated Date - 2020-08-04T06:40:02+05:30 IST