ఉపాధి పని ప్రదేశాల్లో వసతులు

ABN , First Publish Date - 2021-05-11T09:17:04+05:30 IST

రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పనులు జరిగే ప్రదేశాల్లో కూలీలకు వసతులు కల్పించాలని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లు, డ్వామా పీడీలకు సూచించారు

ఉపాధి పని ప్రదేశాల్లో వసతులు

జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్‌ శాఖ ఆదేశాలు


అమరావతి, మే 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పనులు జరిగే ప్రదేశాల్లో కూలీలకు వసతులు కల్పించాలని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లు, డ్వామా పీడీలకు సూచించారు. వేసవి దృష్ట్యా పని ప్రదేశాల్లో తాగునీరు, షేడ్‌లు, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులు, క్రష్‌ సెంటర్ల నిర్వహణకు ఆయాలను ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఉపాధి పని చేసే ప్రతి ఐదు శ్రమశక్తి సంఘాలకు ఒక షేడ్‌ కొనుగోలు చేయాలంటూ దాని వివరాలను సూచించారు. ఈ షేడ్లకు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కస్టోడియన్‌గా వ్యవహరిస్తారన్నారు.  కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రతి ఉపాధి హామీ సిబ్బందికి ఆరు ఎన్‌-95 మాస్క్‌లు డీపీసీ ద్వారా కొనుగోలు చేసి అందించాలన్నారు.  

Updated Date - 2021-05-11T09:17:04+05:30 IST