Abn logo
May 8 2021 @ 15:40PM

అలా చేస్తే కఠిన చర్యలు: కార్తికేయ మిశ్రా

 ఏలూరు: ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ పడకలను 500కు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. ఇందుకోసం  వివిధ ఏజెన్సీలతో సంప్రదిస్తున్నామని చెప్పారు. ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు కరోనా రోగుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆపత్కాల సమయంలో లాభాపేక్ష దృష్టితో చూడడం మంచిది కాదని చెప్పారు. ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజ్‌లోనూ ఆక్సిజన్ పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు.

Advertisement