Advantages Of Onion: ఇంట్లో ఉండే ఈ మూడు సమస్యలను ఉల్లిపాయతో తొలగించండి.

ABN , First Publish Date - 2022-09-01T20:18:38+05:30 IST

మన వంటకాల్లో ప్రధానమైన సరుకు ఉల్లిపాయ. ఇవి లేని కూర చేయడం అంటే వెలితే.. అంతేనా ఉల్లిపాయలో అనేక పోషకాలు ఉన్నాయి.

Advantages Of Onion: ఇంట్లో ఉండే ఈ మూడు సమస్యలను ఉల్లిపాయతో తొలగించండి.

మన వంటకాల్లో ప్రధానమైన సరుకు ఉల్లిపాయ. ఇవి లేని కూర చేయడం అంటే వెలితే.. అంతేనా ఉల్లిపాయలో అనేక పోషకాలు ఉన్నాయి. ఈ ఉల్లిపాయలతో వంటలే కాదు ఇంకా చాలానే ఉపయోగాలు ఉన్నాయట. అవేంటో చూద్దాం.


ఉల్లిపాయల సాయంతో మామూలుగా మన ఇంట్లోని చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవచ్చు. వంటగదిలో, బాత్ రూమ్ లలో., తోటలో కనిపించే కొన్ని రకాల కీటకాలను తరిమేయచ్చట. అంతే కాదు వ్యాధులు రాకుండా కూడా ఉల్లిపాయ కాపాడుతుందట. 


ఉల్లి రసంతో మొక్కలను ఆశించే కీటకాల తరిమేయండి..

ఉల్లి రసం మొక్కలను ఆశించే కీటకాలను తరమడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.  ఒక ఉల్లిపాయను ముక్కలుగా కోసి దానికి కాస్త బేకింగ్ సోడాను, వాటర్ తో కలిపి మిక్సీ పట్టాలి. దీనిని మొక్కల మీద పిచికారీ చేస్తే కీటకాలు తగ్గుతాయి. 


ఉల్లిపాయ బాత్ రూం లోని కీటకాలకు యాసిడ్ లా పనిచేస్తుంది. 

బాత్ రూం గొట్టాల నుంచి వచ్చే రకరకాల కీటకాలను, పురుగులను ఉల్లితో తరిమేయచ్చు. ఉల్లిపాయను నాలుగు ముక్కలుగా తరిగి దానిని డ్రైన్ పక్కన ఉంచితే ఆ వాసనకు కీటకాలు రావు. 


జలుబు నుంచి ఉల్లిపాయ ఉపసమనాన్ని ఇస్తుంది.

జలుబును దూరం చేయడంలో ఉల్లపాయ ఉపయోగపడుతుంది. ఇది చలికాలంలో శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇన్పెక్షన్ నుంచి కాపాడుతుంది. శరీరానికి వేడిని ఇస్తుంది. 

Updated Date - 2022-09-01T20:18:38+05:30 IST