erishaev: ఎలక్ట్రిక్ కార్గో, ప్యాసెంజర్ ఆటోల కోసం ప్రీలాంచ్ బుకింగ్ ప్రారంభించిన ఎరీషా

ABN , First Publish Date - 2022-09-23T02:35:01+05:30 IST

విద్యుత్ వాహనాల ఎగుమతి, హైడ్రోజన్ ఇంధన బస్సుల తయారీ, పంపిణీ, ఎగుమతుల రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న

erishaev: ఎలక్ట్రిక్ కార్గో, ప్యాసెంజర్ ఆటోల కోసం ప్రీలాంచ్ బుకింగ్ ప్రారంభించిన ఎరీషా

న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల ఎగుమతి, హైడ్రోజన్ ఇంధన బస్సుల తయారీ, పంపిణీ, ఎగుమతుల రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రానా గ్రూప్ సంస్థ ఎరీషా ఈ-మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ (Erisha E Mobility Private Limited)  ఈ పండుగ సీజన్‌లో సంచలనానికి సిద్ధమైంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్‌ కార్గో ఈ-సుపీరియర్‌, ఎలక్ట్రిక్‌ ప్యాసెంజర్‌ ఆటో రిక్షా ఈ-స్మార్ట్‌ను  ఎల్‌5 విభాగంలో వచ్చే నెల 2 నుంచి ముందస్తు బుకింగ్స్ ప్రారంభించనున్నట్టు తెలిపింది. 


ఈ సందర్భంగా రానా గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దర్శన్‌ రానా మాట్లాడుతూ.. ఎరీషా ఈ-మొబిలిటీ ప్రధానంగా పర్యావరణ అనుకూల, అందుబాటు ధరలో  రవాణా అవకాశాలను దేశ ప్రజలకు అందించేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు. ఈ-ఆటోను భారత మార్కెట్‌ కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్టు పేర్కొన్నారు. దీనిని  ఒకసారి చార్జ్ చేస్తే  120–142 కిలోమీటర్లు ప్రయాణిస్తందన్నారు. దీని గరిష్ట వేగం గంటకు 50 కిలోమీటర్లని వివరించారు. 


ఈ-సుపీరియర్‌,  ఈ-స్మార్ట్‌ వాహనాలలో  51 వోల్టుల లిథియం-అయాన్‌ బ్యాటరీని ఉపయోగించారు. ఇది 120-142 కిలోమీటర్ల దూరాన్ని ఒక్కసారి చార్జింగ్‌‌తో అధిగమించేందుకు తోడ్పడుతుంది. ఏదైనా స్టాండర్డ్‌ చార్జర్‌తో నాలుగైదు గంటల్లోనే బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయొచ్చు. ఈ రెండు వాహనాలు తెలుపు రంగులో రెడ్‌ కలర్‌ డోర్స్‌తో ఆకర్షణీయంగా ఉన్నాయి. వీటిపై 39 నెలల స్టాండర్డ్‌ వారెంటీని కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ-ఆటో డెలివరీలు నవంబర్‌ 2022 నుంచి ప్రారంభం కానున్నాయి. రూ. 2100ను కంపెనీ వెబ్‌సైట్‌ (www.erishaev.com)లో చెల్లించడం ద్వారా కానీ, దేశవ్యాప్తంగా ఉన్న డీలర్లను సంప్రదించడం ద్వారా కానీ ప్రీబుకింగ్ చేసుకోవచ్చు.

Updated Date - 2022-09-23T02:35:01+05:30 IST