రాజమండ్రి: చింతూరు మండలం మోతుగూడెం వద్ద ఎనభై కిలోల గంజాయి పోలీసులు పట్టుకున్నారు. సీలేరు నుండి మహారాష్ట్రకు స్మగ్లర్‌లు గంజాయి బొలెరో వాహనంలో తరలిస్తున్నారు. గంజాయి తరలిస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రెండు వాహనాలు, నాలుగు సెల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన గంజాయి విలువ రెండు లక్షల నలభై వేలుగా పోలీసులు వెల్లడించారు