ఒడిసా బోర్డర్ వద్ద నిలిచిపోయిన ఏపీకి చెందిన 2వందల కోడిగుడ్ల లారీలు

ABN , First Publish Date - 2022-04-27T20:14:22+05:30 IST

ఒడిస్సా బోర్డర్ వద్ద ఏపీకి చెందిన 2వందల కోడిగుడ్ల లారీలు నిలిచిపోయాయి.

ఒడిసా బోర్డర్ వద్ద నిలిచిపోయిన ఏపీకి చెందిన 2వందల కోడిగుడ్ల లారీలు

అమరావతి: ఒడిస్సా బోర్డర్ వద్ద ఏపీకి చెందిన 2వందల కోడిగుడ్ల లారీలు నిలిచిపోయాయి. గుడ్ల ధరలు పడిపోవడంతో ఒడిసా అధికారులు ఖుర్దా వద్ద లారీలను నిలిపివేశారు. ఏపీ నుంచి నిత్యం అసోం, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు కోడిగుడ్ల ఎగుమతులు అవుతుంటాయి. ఏపీ నుంచి ఎగుమతులవల్ల తమ రాష్ట్రంలో గుడ్లకు గిరాకీ లేకుండా పోతోందని ఒడిసా వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో కోడి గుడ్డు ధర రూ. 4.25 నుంచి 3.25 పైసలకు పడిపోయింది. సీడ్ ధర పెరిగి గుడ్డు రేటు తగ్గిపోయింది. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి బుధవారం ఉయదం 10:30 గంటల వరకు లారీలు నిలిచిపోయాయి. దీంతో ఏపీ పౌల్ట్రీ దారుల సమాఖ్య రంగంలోకి దిగింది. ఒడిసా అధికారులతో సంప్రదింపులు జరపడంతోపాటు అక్కడి పౌల్ట్రీ సమాఖ్యను కూడా చర్చల కోసం రాజమండ్రికి రావాల్సిందిగా కోరారు.

Updated Date - 2022-04-27T20:14:22+05:30 IST