నల్లగొండ: తెలంగాణలో శాంతి భద్రతలు సమర్థంగా అమలు చేస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లాకేంద్రంలో నిర్మించిన భరోసా కేంద్రం, ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్‌ను మంత్రి జగదీష్‌రెడ్డితో కలసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పోలీస్‌శాఖకు ప్రాధాన్యమిస్తూ అధిక నిధులు కేటాయిస్తూ మెరుగైన సేవలందించేలా ప్రోత్సహిస్తున్నారన్నారు. శాంతిభద్రతలు సమర్థంగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని మహేందర్‌రెడ్డి హెచ్చరించారు.