ఆర్థిక ఇబ్బందులతో విద్యావలంటీర్ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-04-14T00:38:59+05:30 IST

ఆర్థిక ఇబ్బందులు భరించలేక విద్యావలంటీర్ ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన పట్టణంలో

ఆర్థిక ఇబ్బందులతో విద్యావలంటీర్ ఆత్మహత్య

నల్గొండ: ఆర్థిక ఇబ్బందులు భరించలేక విద్యావలంటీర్ ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన పట్టణంలో జరిగింది. పాలకూరి శైలజ అనే మహిళ విద్యావలంటీర్‌గా పనిచేస్తోంది. శైలజ భర్త కూడా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో పాఠశాలలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో 15 నెలలుగా విద్యావలంటీర్లకి జీతాలు రాలేదు. తన భర్తకు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం రెన్యూవల్‌ కాలేదు. 


 శైలజ భర్తకు కూడా జీతం అందలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కవయ్యాయి. పూటగడవడం కష్టంగా మారింది. ఆర్థిక ఇబ్బందులను భరించలేక ఎల్లారెడ్డిపేట రైల్వే ట్రాక్‌పై శైలజ ఆత్మహత్యకు పాల్పడింది. మరిన్ని ఆత్మహత్యలు జరుగకుండా ఉండాలంటే విద్యావలంటీర్లను విధుల్లోకి తీసుకొని జీతాలివ్వాలని ప్రభుత్వాన్ని విద్యా వలంటీర్ల సంఘం డిమాండ్ చేసింది. 

Updated Date - 2021-04-14T00:38:59+05:30 IST