‘తూర్పు’లో పలుచోట్ల భారీవర్షం

ABN , First Publish Date - 2022-03-22T02:19:17+05:30 IST

తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం పలుచోట్ల భారీవర్షం కురిసింది. ప్రత్తిపాడు మండలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో

‘తూర్పు’లో పలుచోట్ల భారీవర్షం

ప్రత్తిపాడు: తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం పలుచోట్ల భారీవర్షం కురిసింది. ప్రత్తిపాడు మండలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పలుచోట్ల భారీవర్షం కురిసింది. దీంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. చినశంకర్లపూడి దుర్గమ్మ గుడి వద్ద భారీ రావిచెట్టు కుప్పకూలింది. దీంతో రెండు విద్యుత్‌ స్తంభాలు, రెండు మోటార్‌ సైకిళ్లు, ఒక సైకిల్‌ ధ్వంసమయ్యాయి. ప్రత్తిపాడు, ధర్మవరం, ఏలూరు తదితర గ్రామాల్లో అకాల వర్షానికి మామిడి, జీడిమామిడి తోటలకు తీరని నష్టం వాటిల్లింది. కాకినాడలో గంటపాటు కుండపోత వర్షం కురిసింది. ఏలేశ్వరం, పిఠాపురంలో భారీవర్షం కురిసింది. కిర్లంపూడి, గండేపల్లి, జగ్గంపేట, పెద్దాపురం మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. 

Updated Date - 2022-03-22T02:19:17+05:30 IST