ఒక్క నెలలో... రూ. 900 కోట్ల సంపాదన...

ABN , First Publish Date - 2021-09-29T23:07:03+05:30 IST

స్టాక్ మార్కెట్‎లో పెట్టుబడులు పెట్ట, ఒక్క నెలలో రూ. 200 కోట్లు సంపాదించాడాయన. ఎలా సాధ్యమంటే.... మార్కెట్‎పై పట్టు ఉంటే తప్ప ఇంతలా సంపందించలేం కుదరదు

ఒక్క నెలలో... రూ. 900 కోట్ల సంపాదన...

ముంబై : స్టాక్ మార్కెట్‎లో పెట్టుబడులు పెట్ట, ఒక్క నెలలో రూ. 200 కోట్లు సంపాదించాడాయన. ఎలా సాధ్యమంటే....  మార్కెట్‎పై పట్టు ఉంటే తప్ప ఇంతలా సంపందించలేం కుదరదు. అలా సంపాదించిందెవరో కాదు...  బిగ్ బుల్ రాకేష్ ఝున్ ఝున్ వాలా. స్టాక్ మార్కెట్ల రికార్డు లాభాలతో గత నెల రోజుల్లో భారీగా లాభాలను గడించిన వారిలో..​. ఝున్​ఝున్​వాలా పేరు ముందుగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కేవలం రెండు కంపెనీల్లో పెట్టుబడుల​ ద్వారా.. నెల రోజుల్లో దాదాపు రూ. 900 కోట్ల లాభాన్ని గడించారు. టాటా మోటార్స్, టైటాన్ కంపెనీల షేర్లు రాకేష్ ఝున్ ఝున్ వాలాకు కోట్లు తెచ్చిపెట్టాయి. 


టాటా మోటార్స్, టైటాన్​ కంపెనీ షేర్లలో రాకేశ్​ ఝున్​ఝున్​వాలాకు భారీగా పెట్టుబడులున్నాయి. గత నెల రోజుల్లో టాటా మోటార్స్ షేర్లు 13 శాతం పుంజుంకున్న విషయం తెలిసిందే. టైటాన్​ కంపెనీ షేర్లు 11.40 శాతం పెరిగాయి. ఇదే స్థాయిలో ఝున్​ఝున్​వాలా సంపద కూడా పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్​ త్రైమాసిక డేటా ప్రకారం.. టాటా మోటార్స్‎​లో 3,77,50,000 షేర్లు రాకేష్​పేరు మీదున్నాయి. ఈనెల ఆరంభంలో రూ. 287.30 గా ఉన్న కంపెనీ షేరు విలువ...  రూ. 331 కు పెరిగింది. అంటే ఒక్కో షేరు రూ. 43.70 లాభం తెచ్చి పెట్టిందన్న మాట. ఈ క్రమంలో... రాకేష్​ ఝున్​ఝున్​వాలా ఈ నెలలోనే టాటా మోటార్స్ షేర్ల ద్వారా దాదాపు రూ. 165 కోట్ల లాభాన్ని ఆర్జించారు.


ఇక ఏప్రిల్​-జూన్ త్రైమాసిక గణాంకాల ఆధారంగా టైటాన్​ కంపెనీలో ఝున్​ఝున్​వాలాకు 3,30,10,395 షేర్లు ఉన్నాయి. ఆయన భార్య రేఖా ఝున్​ఝున్​వాలా పేరుమీద 96,40,575 షేర్లున్నట్లు వెల్లడైంది. అంటే టైటాన్‎​లో మొత్తం 4,26,50,970 షేర్లు ఝున్​ఝున్​వాలా దంపతుల పేరు మీదున్నాయి. టైటాన్ షేరు విలువ ఈనెల ఆరంభంలో రూ. 1,921.60 వద్ద ఉండగా.. ఇప్పుడు రూ. 2092.50 వద్దకు పెరిగింది. ఒక్కో షేరు రూ. 170.90 లాభాన్నిచ్చింది. మొత్తంమీద టైటాన్ షేర్ల వృద్ధితో రాకేష్ రూ. 728.90 కోట్లు సంపాదించారు. రెండు కంపెనీల షేర్ల ద్వారా రాకేష్ ఝున్​ఝున్​వాలా సంపద నెల రోజుల్లోనే రూ. 893.87 కోట్లు పెరిగింది. రాకేష్​ ఝున్​ఝున్​వాలాకు మొత్తం 38 కంపెనీల్లో షేర్లు ఉన్నాయి.

Updated Date - 2021-09-29T23:07:03+05:30 IST