Abn logo
Sep 17 2020 @ 11:10AM

ఏపీలో ప్రారంభమైన ఎంసెట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ ప్రారంభమైంది. ఈనెల 25వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్లతో మొత్తం 14 సెషన్లుగా 7 రోజులపాటు నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరి చేశారు. పరీక్షా కేంద్రాల్లో భౌతికదూరం ఉండేలా అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్  నిర్వహిస్తున్నారు. గురువారం నుంచి 23వ తేదీ వరకు ఇంజనీరింగ్, 23 నుంచి 25వ తేదీ వరకు మెడిసిన్, అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షలు ఉంటాయి. 


ఏపీ, తెలంగాణలో కలిపి మొత్తం 2,72,933 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఏపీలో 115, తెలంగాణలో 3 సెంటర్లు ఏర్పాటు చేశారు. కోవిడ్ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకునేలా ఉన్నత విద్యామండలి ద్వారా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఏపీ, హైదరాబాద్‌తో కలుపుకుని 47 పట్టణాల్లో 118 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ పరీక్షకు 1,85,263 మంది, అగ్రీ తదితర కోర్సుల ప్రవేశ పరీక్షకు  87,637 హాజరుకానున్నారు.

Advertisement
Advertisement
Advertisement