Abn logo
Oct 28 2020 @ 02:44AM

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఈ-బోర్డింగ్‌ సదుపాయం

Kaakateeya

హైదరాబాద్‌ : జీఎంఆర్‌ గ్రూప్‌ నిర్వహణలోని హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానా శ్రయం ప్రయాణికులకు మరో సదుపాయా న్ని అందుబాటులోకి తెచ్చింది. విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ-బోర్డింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి  తెచ్చింది. ప్రస్తుతం ఒక్క హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి మాత్రమే అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు ఇలాంటి సదుపాయం అందుబాటులో ఉందని జీఎంఆర్‌ గ్రూప్‌ తెలిపింది. ఈ నెల 2న  షార్జా వెళ్లే ఇండిగో విమా న ప్రయాణికులతో ఎయిర్‌పోర్టు ఈ  కార్యక్రమం ప్రారంభించింది. త్వరలో మరిన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఈ సదుపాయాన్ని విస్తరించబోతోంది. దేశీయ ప్రయాణికులకు హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టులో ఎప్పటి నుంచో ఈ-బోర్డింగ్‌ సదుపాయం అందుబాటులో ఉంది. 


Advertisement
Advertisement