చిట్టీలతో పేరుతో ప్రజలను మోసం చేసిన వ్యాపారి అరెస్ట్

ABN , First Publish Date - 2021-08-18T00:38:04+05:30 IST

చిట్టీలతో పేరుతో ప్రజలను మోసం చేసిన వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ద్వారకాతిరుమలలో బంగారం వ్యాపారం పేరుతో అనధికార చిట్టీలు పెట్టి ప్రజలను మోసం చేసి, పారిపోయిన బంగారం వ్యాపారి చీమకుర్తి రాజాను పోలీసులు అరెస్టు చేశారు.

చిట్టీలతో పేరుతో ప్రజలను మోసం చేసిన వ్యాపారి అరెస్ట్

పశ్చిమగోదావరి: చిట్టీలతో పేరుతో ప్రజలను మోసం చేసిన వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ద్వారకాతిరుమలలో బంగారం వ్యాపారం పేరుతో అనధికార చిట్టీలు పెట్టి ప్రజలను మోసం చేసి, పారిపోయిన బంగారం వ్యాపారి చీమకుర్తి రాజాను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు రూ. 60 లక్షల వరకు ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. రాజాతోపాటు అతని తండ్రి హనుమంతుని అరెస్టు చేశారు. అంతేకాక రాజా ఉంటున్న ఇల్లు, షాప్ మరియు చిట్టిల ద్వారా అతను కొన్న ఆస్తుల వివరాలను సేకరించి కోర్టుకు సమర్పిస్తామని పోలీసులు తెలిపారు.


ద్వారకాతిరుమలలో శ్రీ వెంకట గణేష్ జ్యువెలరీ యజమాని రాజా గత కొంత కాలంగా అనధికార చిట్టీలు, గోల్డ్ స్కీం పేరుతో కస్టమర్లను ఆకర్షించాడని పోలీసులు చెప్పారు. 15 నెలల పాటు నెలకు 2 వేల చొప్పున 30 వేలు చెల్లిస్తే..16వ నెల బోనస్ గా మరో 2 వేలు కలిపి 32 వేలకు బంగారం కానీ వెండి వస్తువులు కానీ ఇస్తామని స్కీం మొదలుపెట్టాడని పోలీసులు వివరించారు. అయితే అతను మాటలు నమ్మిన సుమారు 100 మందికి పైగా కస్టమర్లు గోల్డ్ స్కీంలో చేరి నెలనెలా వాయిదాలు కడుతున్నారు.


అంతేకాక మండలంలో భారీగా చిట్టీలు, వడ్డీల పేరుతో కూడా ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశాడని, ఇక గడువు ముగిసి గోల్డ్ స్కీం, చిట్టీల డబ్బులు ఇవ్వాల్సిన సమయం రావడంతో రాజా షాప్ మూసివేసి, ఇంటికి తాళాలు పెట్టి హఠాత్తుగా కుటుంబంతో సహా పారిపోయాడని బాధితులు తెలిపారు. అయితే రాజా మోసంపై ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-08-18T00:38:04+05:30 IST