డుసెన్ బ్యాట్ విరగ్గొట్టిన భారత పేసర్ అవేశ్ ఖాన్

ABN , First Publish Date - 2022-06-11T01:14:54+05:30 IST

భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టీ20లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సఫారీ జట్టు ఇన్నింగ్స్‌ సమయంలో ఆవేశ్‌ ఖాన్‌

డుసెన్ బ్యాట్ విరగ్గొట్టిన భారత పేసర్ అవేశ్ ఖాన్

న్యూఢిల్లీ: భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టీ20లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సఫారీ జట్టు ఇన్నింగ్స్‌ సమయంలో ఆవేశ్‌ ఖాన్‌ రాకెట్‌ వేగంతో బంతులు విసిరాడు. ఆ సమయంలో ఒక బంతి బ్యాట్‌ను రెండు ముక్కలు చేసింది. ఇన్నింగ్స్‌ 14 వ ఓవర్‌లో మూడో బంతిని ఆఫ్‌సైడ్‌ దిశగా యార్కర్‌ సంధించాడు. క్రీజులో ఉన్న డుసెన్‌ బంతిని ఆడే ప్రయత్నం చేశాడు. అంతే మిడిల్‌లో తాకిన బంతి బ్యాట్‌ను రెండు ముక్కలుగా చీల్చుకుంటూ వెళ్లింది. ఆ తర్వాత బ్యాట్‌ను చూస్తే రెండుగా చీలిపోయి కనిపించింది. దీంతో మరో బ్యాట్‌ తెప్పించుకుని డుసెన్‌ బ్యాటింగ్‌ కొనసాగించాడు.


కాగా, ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా.. టీమిండియా వరుస విజయాలకు కళ్లెం వేసింది. ఇప్పటి వరకు వరుసగా 12 టీ20ల్లో విజయం సాధించిన భారత్.. ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే వరుసగా 13 విజయాలు సాధించిన జట్టుగా రికార్డులకెక్కి ఉండేది. అయితే, భారత జట్టు ఆశలను డుసెన్ (75), డేవిడ్ మిల్లర్ (64) తుంచేశారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన సఫారీ జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది.  


Updated Date - 2022-06-11T01:14:54+05:30 IST