దుర్గమ్మకు సారెను సమర్పించిన ఆలయ అర్చకులు

ABN , First Publish Date - 2022-06-30T14:31:52+05:30 IST

Indrakeeladriపై నేటి నుంచి ఆషాడమాసం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో, కోలాటాలతో అంగరంగ వైభవంగా అమ్మవారికి..

దుర్గమ్మకు సారెను సమర్పించిన ఆలయ అర్చకులు

Vijayawada : Indrakeeladriపై నేటి నుంచి ఆషాడమాసం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో, కోలాటాలతో అంగరంగ వైభవంగా అమ్మవారికి ఆలయ అర్చకులు సారెను సమర్పించారు. కనకదుర్గ నగర్‌లోని గోశాల వద్ద నుంచి అమ్మవారికి సారెను ఆలయ అర్చకులు తీసుకువచ్చారు. ప్రతి ఏడాది ఆషాఢమాసంలో వచ్చే వారాహీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి సారెను సమర్పించారు. అమ్మవారికి సారెను సమర్పిస్తే వర్షాలు బాగా పడి పాడి పంటలు పండి దేశం సస్యశ్యామలంగా ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అమ్మవారిని మన ఇంటి ఆడపిల్లగా భావించి ఆషాడమాసంలో పసుపు, కుంకుమ, చీర జాకెట్, చలివిడిని భక్తులు పెడుతున్నారు. ఆషాఢం సారెను సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఆషాడ మాసం నెలరోజుల పాటు సారెను భక్తులు సమర్పించనున్నారు. మూడు రోజులు ముందుగానే నమోదు చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు. జులై 28వ తేదీ వరకూ ఆషాఢమాసం సారెను సమర్పించారు. ఎంత మంది భక్తులతో వచ్చి అమ్మవారికి సారెను సమర్పిస్తారో ముందుగానే తెలియజేయాలని ఆలయ అధికారులు సూచించారు.

Updated Date - 2022-06-30T14:31:52+05:30 IST