Advertisement
Advertisement
Abn logo
Advertisement

ముగిసిన దుర్గగుడి పాలకమండలి సమావేశం

విజయవాడ: దుర్గగుడి పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశానంతరం దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు మాట్లాడుతూ భవానీ దీక్షా విరమణలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్ని శాఖల అధికారులు భవానీ దీక్షల్లో విధులు నిర్వహిస్తారని, ఈ నెల 25 నుంచి 29 వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణలు చేస్తారని తెలిపారు. 25న ఉదయం 8 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నామని ప్రకటించారు. నాలుగు హోమ గుండాలతో పాటు ఇరుముడులను విప్పేందుకు 50 పాయింట్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధానం వరకు నాలుగు క్యూలైన్లలో అమ్మవారి దర్శనానికి భవానీలను అనమతిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది 5 లక్షల మందికి పైగా భవానీలు వస్తారని అంచనా వేస్తున్నాయని, అందుకు తగ్గట్టుగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని సోమినాయుడు తెలిపారు.

Advertisement
Advertisement