దుబాయ్ చాలా ఇచ్చింది.. ఎంతో కొంత తిరిగివ్వాలిగా అంటున్న అజయ్ శోబ్రాజ్

ABN , First Publish Date - 2020-03-30T02:17:14+05:30 IST

కరోనా వైరస్.. ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి సంఖ్య.. వైరస్ సోకిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫింజా జ్యూవెలరీ ఫౌండర్, ఛైర్మన్ అజయ్ శోబ్రాజ్ పెద్ద మనసు చాటుకున్నా

దుబాయ్ చాలా ఇచ్చింది.. ఎంతో కొంత తిరిగివ్వాలిగా అంటున్న అజయ్ శోబ్రాజ్

దుబాయి: కరోనా వైరస్.. ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి సంఖ్య.. వైరస్ సోకిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫింజా జ్యూవెలరీ ఫౌండర్, ఛైర్మన్ అజయ్ శోబ్రాజ్ పెద్ద మనసు చాటుకున్నారు. దుబాయిలోని జుమేరా లేక్ టౌన్‌లోని 77వేల చదరపు అడుగుల తన భవనాన్ని క్వారెంటైన్‌గా వాడుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దుబాయ్ హెల్త్ అథారిటీకి రాసిన లేఖలో ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. అందులో సుమారు 400 మందికి చికిత్స ఇవ్వొచ్చని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంపై స్థానిక మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో.. ప్రతి ఒక్కరి సహకారం ప్రభుత్వానికి అవసరం అన్నారు. అందరూ సహకరిస్తేనే కరోనాపై విజయం సాధించగలమన్నారు. 25ఏళ్లుగా తన విజయానికి కారణమైన నగరానికి.. ఈ విధంగా సహాయపడుతుండటం సంతోషాన్నిస్తుందన్నారు. కాగా.. భారత్‌కు చెందిన అజయ్ శోబ్రాజ్.. దుబాయ్‌లో ఫింజా జ్యూవెలరీని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 


Updated Date - 2020-03-30T02:17:14+05:30 IST