రాహానేను అవుట్ చేసి రికార్డులకెక్కిన ఒలీవర్

ABN , First Publish Date - 2022-01-03T21:53:38+05:30 IST

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తడబడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ లంచ్

రాహానేను అవుట్ చేసి రికార్డులకెక్కిన ఒలీవర్

జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తడబడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ లంచ్ సమయానికి మూడు కీలక వికెట్లు కోల్పోయింది. మయాంక్ అగర్వాల్ (26), చతేశ్వర్ పుజారా (3), అజింక్య రహానే (0) దారుణంగా విఫలమయ్యారు.


భారత్ కోల్పోయిన మూడు వికెట్లలో రెండు డానే ఒలీవర్‌కు దక్కాయి. రహానేను గోల్డెన్ డక్ చేసిన ఒలీవర్ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. అతి తక్కువ బంతుల్లోనే 50 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఒలీవర్ 1486 బంతుల్లోనే 50 వికెట్లు తీసుకున్నాడు.


వెర్నాండ్ ఫిలాండర్ 1240 బంతుల్లోనే ఆ ఘనత సాధించి అందరికంటే ముందున్నాడు.  బ్రెట్‌ లీ (1844), కైల్ జెమీసన్ (1865), ఫ్రాంక్ టైసన్ (1880), షేన్ బాండ్ (1943) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా, లంచ్ సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, హనుమ విహారి క్రీజులో ఉన్నారు.

Updated Date - 2022-01-03T21:53:38+05:30 IST