డ్రై బ్రషింగ్‌

ABN , First Publish Date - 2021-02-28T08:26:09+05:30 IST

చర్మానికి రక్తప్రసరణ ఎంత మెరుగ్గా ఉంటే, నిగారింపు అంత మెరుగ్గా ఉంటుంది. మర్దన, స్నానం ఇందుకు కొంత మేరకు తోడ్పడతాయి. అయితే మృతకణాలు తొలగి చర్మం మెరుపులీనాలన్నా, ఆరోగ్యంగా

డ్రై బ్రషింగ్‌

చర్మానికి రక్తప్రసరణ ఎంత మెరుగ్గా ఉంటే, నిగారింపు అంత మెరుగ్గా ఉంటుంది. మర్దన, స్నానం ఇందుకు కొంత మేరకు తోడ్పడతాయి. అయితే మృతకణాలు తొలగి చర్మం మెరుపులీనాలన్నా, ఆరోగ్యంగా కనిపించాలన్నా తరచుగా డ్రై బ్రష్‌ చేస్తూ ఉండాలి.


ఎలాంటి బ్రష్‌: బాడీ బ్రషింగ్‌ కోసం ఉద్దేశించిన డ్రై బ్రష్‌నే ఎంచుకోవాలి. కుదుళ్లు కొంత బిరుసుగా ఉండేలా చూసుకోవాలి. పొడవాటి హ్యాండిల్‌ కలిగిన షవర్‌ బ్రష్‌ వాడుకోవచ్చు. 

డ్రై బ్రషింగ్‌ ఇలా: బ్రషింగ్‌ పాదాల నుంచి మొదలుపెట్టాలి. మరీ ఒరిపిడితో లేదా మరీ సున్నితంగా కాకుండా తగినంత ఒత్తిడితో బ్రషింగ్‌ మొదలుపెట్టాలి. పాదాలు, కాళ్లు, చేతుల దగ్గర పొడవాటి స్ట్రోక్స్‌తో, పొట్ట, ఛాతీ ప్రదేశాల్లో వృత్తాకారంలో బ్రషింగ్‌ చేయాలి. ఒకే ప్రదేశంలో ఎక్కువసేపు బ్రషింగ్‌ చేస్తే చర్మం మీద పగుళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి శరీరమంతా తగిలేలా సమంగా బ్రషింగ్‌ చేసుకోవాలి.

బ్రషింగ్‌ తర్వాత: డ్రై బ్రషింగ్‌ స్నానానికి ముందు చేసుకోవాలి. బ్రషింగ్‌తో వదులైన చర్మపు మృతకణాలను స్నానంతో వదిలించి, తడి ఆరేలోపే మాయిశ్చరైజర్‌ పూసుకోవాలి. 

బ్రషింగ్‌ వద్దు: సున్నిత చర్మం కలిగినవాళ్లు, చర్మం మీద కాలిన గాయాలు, దెబ్బలు ఉన్నవాళ్లు డ్రై బ్రష్‌ చేయకూడదు. 

ఠి ఉపయోగాలు: లింఫ్‌ స్రావాలు సక్రమంగా స్రవించడానికి, తద్వారా జీర్ణశక్తి, ఇతరత్రా జీవక్రియలు మెరుగవడానికి, చర్మపు ఆరోగ్యానికీ డ్రై బ్రషింగ్‌ తోడ్పడుతుంది. వారంలో ఒక రోజు డ్రై బ్రషింగ్‌ చేసుకుంటే మంచి ఫలితాలు దక్కుతాయి.

Updated Date - 2021-02-28T08:26:09+05:30 IST