హైదరాబాద్: హైవేపై తాగుబోతు హల్ చల్

ABN , First Publish Date - 2021-10-04T15:37:31+05:30 IST

హైదరాబాద్: నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ జాతీయ రహదారిపై ఓ తాగుబోతు హల్ చల్ చేశాడు.

హైదరాబాద్: హైవేపై తాగుబోతు హల్ చల్

హైదరాబాద్: నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ జాతీయ రహదారిపై ఓ తాగుబోతు హల్ చల్ చేశాడు. ఓ వైన్ షాపులో మద్యం సేవించి రోడ్డుపైకి వచ్చాడు. విజయవాడ వైపు వెళుతున్న వాహనాలను అడ్డుకుంటూ నానా హంగామా సృష్టించాడు. హైవేపై పడుకుని రచ్చ రచ్చ చేస్తుండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. స్థానికులు చెప్పినా వినకపోవడంతో చివరకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Updated Date - 2021-10-04T15:37:31+05:30 IST