ఇకపై డ్రంకెన్‌ డ్రైవ్‌ మాదిరే డ్రగ్‌ టెస్ట్‌లు

ABN , First Publish Date - 2022-04-15T21:40:34+05:30 IST

జంటనగరాల్లో డ్రగ్స్ తీసుకుంటున్న వారి శాతం పెరుగుతున్న నేపద్యంలో పోలీసులు ఇక నుంచి డ్రగ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించారు.

ఇకపై డ్రంకెన్‌ డ్రైవ్‌ మాదిరే డ్రగ్‌ టెస్ట్‌లు

హైదరాబాద్: జంటనగరాల్లో డ్రగ్స్ తీసుకుంటున్న వారి శాతం పెరుగుతున్న నేపద్యంలో పోలీసులు ఇక నుంచి డ్రగ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించారు. డ్రంకెన్ డ్రైవ్ మాదిరిగానే డ్రగ్స్ టెస్ట్ డ్రైవ్ లను నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. టెస్ట్ లో భాగంగా అనుమానితుల నోట్లోని లాలాజలంతో టెస్ట్‌ చేస్తారు. 2 నిమిషాల్లో రిజల్ట్ వస్తుందని పోలీసులు తెలిపారు. ఇప్పటికే కేరళ, గుజరాత్‌లో ఈ  ప్రయోగం సక్సెస్ అయినట్టు పోలీసులు తెలిపారు. డ్రగ్‌ టెస్ట్‌ల నిర్వహణకు హైదరాబాద్ పోలీసుల కసరత్తు చేస్తున్నారు. డ్రగ్స్ వినియోగదారులను గుర్తించేందుకు డ్రగ్ అనలైజర్లుగంజాయి, హష్‌ ఆయిల్, కొకైన్, హెరాయిన్లను గుర్తించే డ్రగ్ అనలైజర్లు వినియోగించాలని నిర్ణయించారు. టెస్టుల ఫలితాలను పోలీసులు అధ్యయనం చేయనున్నారు. లా అండ్ ఆర్డర్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు డ్రగ్ పరీక్షలు చేయనున్నారు. 

Updated Date - 2022-04-15T21:40:34+05:30 IST