సుధాకర్‌ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం

ABN , First Publish Date - 2020-06-02T07:53:15+05:30 IST

రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు డాక్టర్‌ సుధాకర్‌ కేసు దర్యాప్తును స్వీకరించిన సీబీఐ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.

సుధాకర్‌ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం

పోలీసుల నుంచి కీలక పత్రాలు స్వాధీనం


విశాఖపట్నం, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు డాక్టర్‌ సుధాకర్‌ కేసు దర్యాప్తును స్వీకరించిన సీబీఐ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. సోమవారం నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్‌ ఏసీపీ కులశేఖర్‌, ద్వారకా ఏసీపీ మూర్తితో  సుమారు 3 గంటల సేపు భేటీ అయ్యారు. డాక్టర్‌ సుధాకర్‌ రోడ్డుపై ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తున్నట్టు ఎన్ని గంటలకు సమాచారం అందింది? అక్కడికి సిబ్బంది ఎవరు వెళ్లారు? ఎవరు పంపించారు? పోలీస్‌ స్టేషన్‌కు ఎప్పుడు, ఎవరు, ఎలా తీసుకువచ్చారు? సుధాకర్‌ కుమారుడు లలిత్‌ను తమ కార్యాలయానికి పిలిపించుకుని కొన్ని విషయాలపై ఆరా తీశారు. ఇదిలావుంటే, తన కుమారుడిపై దాడి చేసిన ఘటనలో బాధ్యులైన పోలీసులందరిపైనా ఐపీసీ సెక్షన్‌లతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదుచేయాలని డాక్టర్‌ సుధాకర్‌ తల్లి కావేరిబాయి సీబీఐ అధికారులకు సోమవారం వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2020-06-02T07:53:15+05:30 IST