ఇండియన్ అమెరిన్లపై ట్రంప్ కుమారుడు పొగడ్తల జల్లు..!

ABN , First Publish Date - 2020-09-19T17:16:51+05:30 IST

అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ 3న ఎన్నికలు జరగనున్న తరుణంలో.. డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ఎరిక్.. ఇండియన్ అమెరికన్లపై ప్రశంసలు వర్షం కురిపించా

ఇండియన్ అమెరిన్లపై ట్రంప్ కుమారుడు పొగడ్తల జల్లు..!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ 3న ఎన్నికలు జరగనున్న తరుణంలో.. డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్.. ఇండియన్ అమెరికన్లపై ప్రశంసలు వర్షం కురిపించారు. ‘ఇండియన్ వాయిసెస్ ఫర్ ట్రంప్’ కార్యక్రమాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎరిక్ ట్రంప్.. అమెరికాను ఉన్నత స్థానంలో నిలపడానికి ఇండియన్ అమెరికన్లు తీవ్రంగా కృషి చేశారన్నారు. భారతీయ అమెరికన్లు.. ట్రంప్ ఎప్పుడూ నిరాశపర్చరని పేర్కొన్నారు. అద్భుతమైన భారత సమాజాన్ని.. ట్రంప్ కుటుంబం ఎప్పుడూ ప్రేమిస్తుందన్నారు. చైనా, పాకిస్థాన్‌ల విషయంలో తన తండ్రి అనుసరించిన విధానాన్ని ఆయన ప్రస్తావించారు. వివిధ సందర్భంల్లో ట్రంప్.. భారత్‌కు మద్దతు ఇచ్చినట్లు గుర్తు చేశారు. కాగా.. మెజారిటీ ఇండియన్ అమెరికన్లు డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ వైపే ఉన్నట్లు తాజా సర్వేలో స్పష్టం అయింది. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ నేతలు.. భారతీయ అమెరికన్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే ‘ఇండియన్ వాయిసెస్ ఫర్ ట్రంప్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సమాచారం. 


Updated Date - 2020-09-19T17:16:51+05:30 IST