మళ్లీ పెరిగిన Domestic LPG Cylinder ధర

ABN , First Publish Date - 2022-05-19T15:47:57+05:30 IST

దేశంలో వంటగ్యాస్ ధర గురువారం మరోసారి పెరిగింది...

మళ్లీ పెరిగిన Domestic LPG Cylinder ధర

న్యూఢిల్లీ:దేశంలో వంటగ్యాస్ ధర గురువారం మరోసారి పెరిగింది. గ్యాస్ సిలిండర్ ధర వెయ్యిరూపాయల మార్కు దాటింది.దేశీయ వంటగ్యాస్ ఎల్‌పీజీ ధర గురువారం సిలిండర్‌కు రూ.3.50 చొప్పున పెంచారు. ఈ నెలలో గ్యాస్ రేట్లు రెండవసారి పెంచారు.రాష్ట్ర ఇంధన రిటైలర్ల ధర నోటిఫికేషన్ ప్రకారం సబ్సిడీ లేని ఎల్పీజీ ఇప్పుడు దేశ రాజధానిలో 14.2కిలోల సిలిండర్‌ ధర 1,003కు పెరిగింది.మే 7వతేదీన  సిలిండర్‌కు 50 రూపాయలు పెంచారు. అంతకు ముందు మార్చి 22వతేదీ కూడా అదే మొత్తంలో ధరలు పెరిగాయి.వాణిజ్య సిలిండర్ ధర రూ.8 పెరిగింది. వంటగ్యాస్ ధర పెంపుతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది.


Updated Date - 2022-05-19T15:47:57+05:30 IST