చిన్న సంస్థలకు ‘ఫండింగ్‌ డాక్టర్‌’ సేవలు

ABN , First Publish Date - 2020-02-20T06:24:27+05:30 IST

సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థ (ఎంఎ్‌సఎంఈ)లకు నిధుల సమీకరణ, రావాల్సిన బకాయిల

చిన్న సంస్థలకు ‘ఫండింగ్‌ డాక్టర్‌’ సేవలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థ (ఎంఎ్‌సఎంఈ)లకు నిధుల సమీకరణ, రావాల్సిన బకాయిల రికవరీ వంటి సేవలను అందించడం కోసం బిజినెస్‌ డాక్టర్‌ ‘ఫండింగ్‌ డాక్టర్‌’ పేరుతో సేవలను ప్రారంభించింది. చిన్న సంస్థలు రుణాలు, ఈక్విటీ, వెంచర్‌ క్యాపిటల్‌, ప్రైవేట్‌ ఈక్విటీ, క్యాపిటల్‌ మార్కెట్లో లిస్టింగ్‌ ద్వారా నిధుల సమీకరణకు ఫండింగ్‌ డాక్టర్‌ సాయపడుతుందని, హైదరాబాద్‌లో ఈ సేవలను ప్రారంభించామని ఫండింగ్‌ డాక్టర్‌ సహ వ్యవస్థాపకుడు ఎం శ్రీనివాసరావు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని ఎంఎ్‌సఎంఈలకు నిధుల సమీకరణ, బకాయిల రికవరీకి సాయం చేస్తామని చెప్పారు. త్వరలో హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాలకు సేవలను విస్తరించనున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-02-20T06:24:27+05:30 IST