15ఏళ్ల బాలికకు అబార్షన్ చేసి.. కారులో వెళ్తూ పిండాన్ని పారేసిన డాక్టర్!

ABN , First Publish Date - 2020-07-20T03:05:29+05:30 IST

ఓ 15ఏళ్ల అమ్మాయికి అబార్షన్ చేసి, ఆ పిండాన్ని తనతో తీసుకెళ్తూ కారులోంచి చెత్తలో పడేశాడో డాక్టర్.

15ఏళ్ల బాలికకు అబార్షన్ చేసి.. కారులో వెళ్తూ పిండాన్ని పారేసిన డాక్టర్!

అహ్మదాబాద్: ఓ 15ఏళ్ల అమ్మాయికి అబార్షన్ చేసి, ఆ పిండాన్ని తనతో తీసుకెళ్తూ కారులోంచి చెత్తలో పడేశాడో డాక్టర్. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. ఈ అబార్షన్ చేసినందుకుగానూ సదరు బాలిక వద్ద రూ.15వేలు తీసుకున్నాడట ఈ డాక్టర్. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సదరు డాక్టర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అక్రమంగా అబార్షన్ చేసినందుకు వైద్యుడిని అరెస్టు చేశారు. అలాగే బాలిక గర్భానికి కారణమైన ఓ 19ఏళ్ల కుర్రాడిని కూడా పట్టుకున్నారు. అతనిపై అత్యాచారంతోపాటు పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-07-20T03:05:29+05:30 IST