Published: Sat, 20 Mar 2021 00:00:00 IST >చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి టోనర్లు వాడడం తప్పనిసరి. వీటివల్ల చర్మ రంధ్రాల్లో పేరుకున్న మురికి పోతుంది. చర్మం జిడ్డుగా ఉండదు. అయితే ఆల్కహాల్ లేని నేచురల్ టోనర్లను ఉపయోగించాలి.
ఎండలో బయటకు వెళ్లే ముందు సన్‌స్ర్కీన్ లోషన్ పూసుకోవాలి. చాలామంది ఎప్పుడూ ఒకేరకమైన సౌందర్య ఉత్పత్తులు వాడుతుంటారు. అయితే వయసు పెరిగే కొద్దీ చర్మం స్వభావానికి తగిన బ్యూటీ ఉత్పత్తులను ఎంచుకోవాలి.వేసవిలో నీళ్లు బాగా తాగడం వల్ల తగినంత తేమ అంది చర్మం మృదువుగా, కాంతిమంతంగా ఉంటుంది.చాలినంత నిద్ర లేకపోతే స్ట్రెస్ హార్మోన్లు విడుదలై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఇన్ఫ్లమేషన్ తలెత్తి చర్మం పొడిగా మారి దురద పెడుతుంది. అందుచేత కంటినిండా నిద్ర తప్పనిసరి.చర్మంపై ముడతలు కనిపించిన వెంటనే యాంటీ ఏజింగ్ ఉత్పత్తులను వాడేస్తుంటారు. అనవసరంగా బ్యూటీ ఉత్పత్తులను వాడడం చర్మానికి హాని చేస్తుంది. ఉన్నట్టుండి డైట్ మార్చడం, రాత్రుళ్లు చర్మానికి క్రీము రాసుకోకపోవడం, మొటిమలు వస్తే ఆ ప్రదేశాన్ని తరచూ తాకుతుండడం, బ్లాక్‌హెడ్స్‌ను గోళ్లతో తొలగించాలని ప్రయత్నించడం వంటివి చేయడం వల్ల చర్మ కణాలు, వాటి స్వరూపం దెబ్బతింటుంది.
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.