చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ పట్ల అవమానకరంగా ప్రవర్తించొద్దు

ABN , First Publish Date - 2022-05-22T06:58:59+05:30 IST

విచారణ ప్రాధికార సంస్థలు (ఇన్వె్‌స్టగేటింగ్‌ అథారిటీస్‌) ఇటీవలి కాలంలో చార్టర్డ్‌ అకౌంటెంట్ల (సీఏ)ను అరెస్ట్‌ చేయడం..

చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ పట్ల అవమానకరంగా  ప్రవర్తించొద్దు

విచారణ సంస్థలతో చర్చించేందుకు బృందం: ఐసీఏఐ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): విచారణ ప్రాధికార సంస్థలు (ఇన్వె్‌స్టగేటింగ్‌ అథారిటీస్‌) ఇటీవలి కాలంలో చార్టర్డ్‌ అకౌంటెంట్ల (సీఏ)ను అరెస్ట్‌ చేయడం.. వారి పట్ల అవమానకరంగా ప్రవర్తించడంపై  ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) ఆందోళనం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఐసీఏఐ కౌన్సిల్‌ శనివారం చర్చించింది. కొంతమంది విచారణ అధికారులు సీఏలను విచారించే సమయంలో అవమానకరంగా ప్రవర్తించడాన్ని ఐసీఏఐ కౌన్సిల్‌ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఏ మాత్రం ఆలోచించకుండా నేరుగా అరెస్ట్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. అసలు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా.. సీఏల పట్ల అవమానకరంగా ప్రవర్తించడాన్ని, అరెస్ట్‌ చేయడాన్ని దేశవ్యాప్తంగా సీఏలు వ్యతిరేకిస్తున్నట్లు ఐసీఏఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో విచారణ ప్రాధికార సంస్థలతో చర్చించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఐసీఏఐ కౌన్సిల్‌ నిర్ణయించింది. సీఏల పట్ల సముచితంగా ప్రవర్తించాలని.. చిన్నచిన్న కారణాలకే వారిని లక్ష్యం చేసుకోరాదని కోరింది. 

Updated Date - 2022-05-22T06:58:59+05:30 IST