‘ఈటల చెబుతున్న 10 లక్షల పీపీఈ కిట్స్ ఎటు పోయాయో..?’

ABN , First Publish Date - 2020-06-06T23:27:27+05:30 IST

తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెబుతున్న 10 లక్షల పీపీఈ కిట్స్ ఎటు పోయాయో..?..

‘ఈటల చెబుతున్న 10 లక్షల పీపీఈ కిట్స్ ఎటు పోయాయో..?’

జోగులాంబ గద్వాల : తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెబుతున్న 10 లక్షల పీపీఈ కిట్స్ ఎటు పోయాయో..? ప్రభుత్వం చెప్పాలని బీజేపీ నేత డీకే అరుణ ప్రశ్నించారు. ఇవాళ జిల్లా కేంద్రంలో మీడియా మీట్ నిర్వహించిన ఆమె.. తెలంగాణ సర్కార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పుకునే రాష్ట్రంలో కరోనా టెస్ట్‌లు చేయడంలో పూర్తిగా వెనకబడిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో డాక్టర్ల ప్రాణాలకే ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోతోందన్నారు. దేశంలోనే కరోనా టెస్టుల్లో అత్యంత వెనుకబడిన రాష్ట్రం తెలంగాణ అని ఆమె ఆరోపించారు.

 

ఒక్క ఆసుపత్రిలో కూడా కరోనా చికిత్సకు సరైన సదుపాయాలు లేవన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే డాక్టర్లకు కరోనా సోకుతోందన్నారు. కరోనా నుంచి ప్రజలను కాపాడుతున్న డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు పీపీఈ కిట్స్, మాస్కులు అందుబాటులో లేవని అరుణ చెప్పుకొచ్చారు. పరీక్షలు చేయటం, పీపీఈ, మాస్కులు ఇవ్వటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఎన్ని మాస్కులు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని అరుణ డిమాండ్ చేశారు. కోవిడ్ ఆస్పత్రిగా మార్చిన గచ్చిబౌలి ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని అరుణ వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-06-06T23:27:27+05:30 IST