Abn logo
Aug 28 2021 @ 14:10PM

ఉద్యమ కాంక్షను కేసీఆర్ ఫాంహౌస్‌లో బంధించారు : డీకే అరుణ

హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని బీజేపీ నాయకురాలు డీకే అరుణ పేర్కొన్నారు. హుజురాబాద్ ఉప‌ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలన్నారు. ఉద్యమ ఆకాంక్షను సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో బందీ చేశారన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని సీఎం‌ కేసీఆర్ మాట తప్పారన్నారు. కేసీఆర్ నియంతృత్వ, అవినీతి పాలనకు త్వరలోనే చరమగీతం పాడుతామని డీకే అరుణ పేర్కొన్నారు.