కేసీఆర్‌ అహంకారాన్ని అణచివేయాలి

ABN , First Publish Date - 2021-03-05T06:21:14+05:30 IST

కేసీఆర్‌ అహంకారాన్ని అణచివేయాలి

కేసీఆర్‌ అహంకారాన్ని అణచివేయాలి
స్టేషన్‌ ఘన్‌పూర్‌లో సమావేశంలో మాట్లాడుతున్న డీకే ఆరుణ

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే ఆరుణ

స్టేషన్‌ఘన్‌పూర్‌, మార్చి 4: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, ఉద్యోగులు టీ ఆర్‌ఎస్‌ పార్టీని ఓడించి కేసీఆర్‌ అహంకారాన్ని అణచివేయాలని బీజేపీ జాతీ య ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే ఆరుణ పిలుపునిచ్చారు. గురువారం రాత్రి డివిజన్‌ కేంద్రంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు మాదాసి వెంకటేష్‌ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమావేశానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించడానికి పట్టభద్రులు సిద్ధంగా ఉన్నారన్నారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పునరావృతం చేయాలని కోరారు. ఎన్నికల్లో గెలుస్తామనే అతివిశ్వాసం కార్యకర్తలకు ఉండకూడదని ప్రతీ ఓటరును ఒకటికి రెండు సార్లు కలిసి ఓటును అభ్యర్థించాలన్నారు. ఉద్యోగాల విషయంలో కేసీఆర్‌, మంత్రులు పొంతనలేని మాటాలు మాట్లాడుతున్నారని ఇప్పటికైనా నేతలు జూఠా మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఓడిస్తేనే కుటుంబ పాలనకు పుల్‌స్టాప్‌ పడుతుందన్నారు. అధికార, అహంకార, నియంతృత్వ, నిరంకుశ పాలనను అడ్డం పెట్టుకొని కొందరు మంత్రులు రెచ్చిపోయి మూడేళ్ల పాటు తామే అఽధికారంలో ఉంటామని ప్రజలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలు ఎవరి అబ్బసొమ్ము అని ముడిపెడుతారని నిలదీశారు. రాష్ట్రంలో ప్రజలు మార్పుకోరుకుంటున్నారని టీఆర్‌ఎ్‌సకు ప్రత్యమ్నయ పార్టీ బీజేపీయేనని సిద్ధమయ్యారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, జీవీఆర్‌, దశమంతరెడ్డి, కేవీఎల్‌ఎన్‌రెడ్డి, వెంగల్‌రావు, గట్టు క్రిష్ణగౌడ్‌, బొట్ల శ్రీనివాస్‌, ప్రేమలతరెడ్డి, ఇనుగాల యుగేందర్‌రెడ్డి, కొలనుపాక శరత్‌, తాళ్లపల్లి శ్రీనవాస్‌, మందపురం సతీష్‌, సంపత్‌రెడ్డి, శాగ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-05T06:21:14+05:30 IST