దీపావళి, కార్తీక పౌర్ణమికి గ్రహణాలు!

ABN , First Publish Date - 2022-10-08T09:12:16+05:30 IST

దీపావళి, కార్తీక పౌర్ణమికి గ్రహణాలు!

దీపావళి, కార్తీక పౌర్ణమికి గ్రహణాలు!

రాత్రిపూట అమావాస్య ఉన్నది 24వ తేదీనే

లక్ష్మీ పూజ, బాణసంచా కాల్చడం ఆ రోజే చేసుకోవాలంటున్న పండితులు

25న సెలవు ఇచ్చిన ప్రభుత్వాలు.. ఆ రోజు పాక్షిక సూర్య గ్రహణం

కార్తీక పౌర్ణమి నాడు చంద్ర గ్రహణం


హైదరాబాద్‌, అక్టోబరు 7: దేశ ప్రజలంతా పెద్ద ఎత్తున జరుపుకొనే దీపావళి నాడు (అక్టోబరు 25న) పాక్షిక సూర్యగ్రహణం.. పూజలు చేసే కార్తీక పౌర్ణమినాడు చంద్రగ్రహణం ఏర్పడుతున్నాయి. 25వ తేదీన సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటల వరకూ సూర్యగ్రహణం ఏర్పడుతుందని జ్యోతిష పండితులు తెలిపారు. ఆరోజేనే ప్రభుత్వాలు దీపావళి సెలవు దినంగా ప్రకటించాయి. అయితే.. 25వ తేదీ సాయంత్రం 4.19 గంటలకు అమావాస్య వెళ్లిపోయి పాడ్యమి వస్తుంది. ఆరోజు రాత్రిపూట అమావాస్య ఘడియలు ఉండవు. 24వ తేదీ ఉదయాన్నే చతుర్దశి తిథి ఉంటుందని.. సాయంత్రం వచ్చిన అమావాస్య తిథి ఆ రాత్రంతా ఉంటుంది కాబట్టి.. ఉదయాన్నే అభ్యంగన స్నానం, సాయంత్రం లక్ష్మీ పూజ నిర్వహించుకోవడం, పటాసులు కాల్చడం అదే రోజు చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఇక, కార్తీక పౌర్ణమినాడు (నవంబరు 8న) మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్ర గ్రహణం ఏర్పడనుంది. సూర్యాస్తమయం అయ్యాక కొద్ది సేపటి వరకే గ్రహణం ఉంటుది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం చివరి ఘడియల్లో మాత్రమే కనిపించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. అయితే.. నవంబరు 7 సాయంత్రం నుంచే పౌర్ణమి ప్రారంభం అవుతుంది కాబట్టి 8న చంద్రగ్రహణం ఉన్నందున కార్తీక వ్రతాలేవైనా ఉంటే 7వ తేదీన జరుపుకోవచ్చని వారు సూచిస్తున్నారు.


Updated Date - 2022-10-08T09:12:16+05:30 IST