నిత్యదీపావళి

ABN , First Publish Date - 2020-11-14T06:05:18+05:30 IST

దీపావళీ రమ్ము స్వాగతమ్ము క్రొవ్వెలుగులు తెమ్ము స్వాగతమ్ము మానవత్వపుదివ్వెలు వెలిగింప రమ్ము స్వాగతమ్ము సుస్వాగతమ్ము.....

నిత్యదీపావళి

దీపావళీ రమ్ము స్వాగతమ్ము

క్రొవ్వెలుగులు తెమ్ము స్వాగతమ్ము

మానవత్వపుదివ్వెలు వెలిగింప రమ్ము

స్వాగతమ్ము సుస్వాగతమ్ము


కరోనానరకాసురుణ్ణి

పరిమార్చగ రమ్ము రారమ్ము

నవజీవన భావనా రంగమ్మువై

రమ్ము నీవే శాంతి కుటీరమ్ము


నీ కాంతివీక్షణాలతో

నీ కాంతి అస్త్రాలతో

నీ కాంతి పుంజాలతో

కరోనాభీకరావృత

తిమిరవలయాన్ని ఛేదించు


నీ కృత్యగ్నిముష్టిఘాతాలతో బాధించు

నవశకారంభం కావించి ఆబాలగోపాలానికి

ఆనందాన్ని ఆహ్లాదాన్ని అందించు

విజ్ఞానాన్ని వివేకమార్గంలో నడిపించు

ఆశలవనిలో వెలుగుపూలు పూయించు

అదేమాకు నిత్యదీపావళి

అదేమాకు స్వచ్ఛ దీపావళి

అదే ప్రగతి రవళి

అదే కలిమి సరళి

అదే వెలుగునిచ్చెనపై

భువినీ దివినీ కలిపే రాగావళి


–మంకు శ్రీను

Updated Date - 2020-11-14T06:05:18+05:30 IST