జిల్లాల విభజనపై రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్‌లకు మౌఖిక ఆదేశాలు

ABN , First Publish Date - 2022-01-28T17:55:21+05:30 IST

జిల్లాల విభజనపై రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్‌లకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

జిల్లాల విభజనపై రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్‌లకు మౌఖిక ఆదేశాలు

అమరావతి : జిల్లాల విభజనపై రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్‌లకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు దూరంగా ఉన్న మండలాల వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. విభజనపై ఆయా జిల్లాల్లో ఆందోళనలు జరుగుతుండడంతో ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కేంద్రాలకు సుదూరంగా ఉన్న మండలాల వివరాలను పంపాలని ఉన్నతాధికారులు కోరారు. సుదూరంగా ఉన్న మండలాలను ఏ జిల్లాలో కలపాలో కూడా తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల విభజన చేసుకునేందుకు ఈ ఏడాది జూన్‌ 30 వరకు తమకు అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. 


ఏప్రిల్‌ 2వ తేదీ నాటికి జిల్లాల విభజన చేసి తీరుతామని అధికారులు స్పష్టం చేశారు. 


పునర్విభజనపై జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో సుదూర మండలాలు, ఆందోళనలపై నివేదిక పంపాలని కలెక్టర్‌లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. 

Updated Date - 2022-01-28T17:55:21+05:30 IST